నా గురించి కొద్దిగా..

తెలుగు భాషలో అందరికీ ఉపయోగమయ్యేలా యూనికోడ్ ఫాంట్లు రావాలనీ అవి ముద్రణకు అనుగుణంగా, అందంగా ఉండాలని కోరుకుంటున్న సమయంలో మొదట రమణీయ ఫాంట్‌ను తయారు చేశాను. ఆ తరువాత సిలికానాంధ్ర సహకారంతో పొన్నాల, లకిరెడ్డి, రవిప్రకాష్‌ ఫాంట్లను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఐటీ శాఖ తెలుగువిజయం పేరిట చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో.. డెస్క్‌టాప్ పబ్లిషింగ్ రంగంలో నాకు గల 32 సంవత్సరాల అనుభవంతో ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా మరికొన్ని యూనీకోడ్ ఫాంట్లను తయారు చేసి అందించాను. ఈ ఫాంట్లను ఉపయోగించి అనేక పుస్తకాలు ముద్రితమైనవి. అంతేకాక యూనికోడ్ ఫాంట్లను ఉపయోగించి Text ని టైప్‌ చేయడానికి తగిన Typing Tools (7 keyboard layouts for both Windows & Mac) ని కూడా అభివృద్ధి పరిచాను. వీటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలన్న తపనతోనే ఈ OpentypeFoundry.com

అప్పాజీ అంబరీష దర్భా